- ప్రపంచం మెచ్చిన నేత, భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి కి అసెంబ్లీ కన్వీనర్ కే రాఘవేందర్ రావు ఘన నివాళి
నమస్తే శేరిలింగంపల్లి: భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అడుగుజాడల్లో నడిచి దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయనను విశ్వగురువుగా నిలబెట్టాలని అసెంబ్లీ కన్వీనర్ కే రాఘవేందర్ రావు పిలుపు నిచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ కన్వీనర్ కే రాఘవేందర్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రత్యేక ఎల్.ఈ.డీ స్క్రీన్ పై వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించి, వాజ్‌పేయి ప్రపంచం మెచ్చిన నేత అని, ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఆయన పేరు మరవలేనిదని, ఆయన పరిపాలనలో భారత దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపు దిద్దుకున్నాయని పేర్కొన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండేదని, వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ రక్షణ రంగం, విద్యారంగంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, అవి ఇప్పటికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
అప్పటి శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా వంటి దేశాలకు ఏ మాత్రం జంకకుండా అను బాంబు ప్రయోగాలు చేసి భారత దేశాన్ని శక్తివంతంగా చేసిన ఘనత వాజ్‌పేయికే దక్కుతుందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, మువ్వ సత్య నారాయణ, డా. కే. నరేష్, కాంచన కృష్ణ, ఉపాదక్షుడు మహిపాల్ రెడ్డి, డీ.ఎస్.అర్.కే ప్రసాద్, కార్యదర్శి వరలక్ష్మి, శాంతి భూషణ్ రెడ్డి, కుమార్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ, స్వామి గౌడ్, టి రాఘవేందర్ రావు, అసెంబ్లీ కో కన్వీనర్ మణి భూషణ్, బొబ్బ నావతా రెడ్డి, రాజు శెట్టి కురుమ, ఏళ్లేశ్, చిట్టా రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, సత్య కుర్మా, సి. బాలరాజు, శివ కుమార్ వర్మ, రాకేష్ దుబే, శోభ దుబె, ఆంజనేయులు, మస్తాన్ అలి, సాయి కుమార్, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.