క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలి : బిజెపి జిల్లా అధ్యక్షుడు పన్నాలా హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

  • ఆకట్టుకున్న ఆటల పోటీలు
  • వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
    నాలుగు రోజులుగా పోటీల నిర్వహణ
  • శనివారం బహుమతుల ప్రదానోత్సవం
  • విజేతలకు బహుమతులు అందజేసిన హరీష్ రెడ్డి, రవి కుమార్ యాదవ్
స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు పన్నాలా హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

బిజెపి జిల్లా అధ్యక్షుడు పన్నాలా హరీష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, కన్వీనర్ రాఘవేంద్రరావు, కో కన్వీనర్ మనిభుషన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ రవీందర్ రావు పాల్గొని గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఆటల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించిన వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తూ మాట్లాడారు. అలాగే పోటీలలో పాల్గొన్న వారికి, గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలలో గెలవాలని ఏవిధంగా పోటీ పడతామో.. విద్యలోనూ పోటీపడి చదవాలని సూచించారు. ఓడిన , గెలిచిన సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి స్కూల్, కాలేజీల్లో, డివిజన్ల లోని యువతకు ఆటల పోటీలు నిర్వహించాలని, ఆటలను మర్చిపోయి ఫోన్ లలో కాలం గడుపుతున్నారని, దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రవీందర్ రావు మాట్లాడుతూ ఆటల పోటీల వల్ల విద్యార్థుల్లో నూతనోత్తేజం పెంపొందుతుందని , చదువుల్లో బాగా రాణిస్తారాణి పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్ సాయి కుమార్, జనరల్ సెక్రెటరీ కుమార్ యాదవ్, కన్వీనర్ రమేష్, నాయకులు నర్సింగ్ రావు, స్రవంతి, నర్సింగ్ యాదవ్, ఆంజనేయులు, రాజు, విష్ణు పాల్గొన్నారు.

బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here