నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయంలో భారతరత్న అటల్ బిహారీ వాజపేయి జయంతి నిర్వహించగా.. వాజపేయి చిత్ర పటానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బలమైన భారతదేశానికి పునాది వేశారన్నారు. అటల్‌జీ చేసిన సేవలను స్మరించుకుంటూ మోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ‘సుపరిపాలన దినోత్సవం’ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుందని తెలిపారు. అయన దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2014 డిసెంబర్24 తేదీన భారతరత్న అవార్డ్ పురస్కారం ప్రకటించింది. నిజమైన రాజకీయ నాయకుడికి నిదర్శనం అటల్ బిహారి వాజపేయి. ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకున్నా ఏకైక నాయకుడు అటల్ బిహారి వాజపేయి అన్ని అన్నారు. మోడీ ప్రభుత్వ నీతివంతమైన పాలనకు ప్రజలు జైకోడుతున్నారని,కేసీఆర్ కల్లబొల్లి మాటలతో కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ శ్రేణులను కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఓబీసీ ఉపాధ్యక్షులు హరీష్ శంకర్ యాదవ్ సీనియర్ నాయకులు దారుగాపల్లి అనిల్, సంతోష్, నగేష్, ఖలీల్ గంగాధర్, టీంకు, నర్సింగ్ రావు, రాజు, రమణ, నరేష్ యాదవ్ క్రాంతి, రాకేష్ పాల్గొన్నారు.