- శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసి కమిటీ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసీ
శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీ వడ్డెర బస్తి గచ్చిబౌలి లో శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జేఏసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వడ్డెర జేఏసీ కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ల బస్తీల నుండి వడ్డెర నాయకులు పాల్గొని వడ్డెరల సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం జేఏసీ చైర్మన్ యాదయ్య, వైస్ చైర్మన్ ముద్దంగుల మల్లేష్, కన్వీనర్ ముద్దంగుల తిరుపతి, ముద్దంగుల బాలరాజు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక లక్ష 15వేల మంది వడ్డెరలు ఉండగా, ఇందులో 80 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు వడ్డెరలకు సరైన న్యాయం చేయలేదని, వడ్డెరలకు రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు వడ్డెరలను గుర్తించాలని, వడ్డెరల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం వడ్డెర జెఎసి కో కన్వీనర్స్ కోమ్మరాజుల రవికుమార్, తాయప్ప, కమిటీ సభ్యులు మంజల గంగాధర్, ఓర్సు సుబ్రహ్మణ్యం, ఆలకుంట నరసింహ, వల్లెపు నారాయణ, వల్లెపు మల్లేష్, వల్లేపు శ్రీను, పల్లపు గోపయ్య, ఆలకుంట తిరుపతి, పల్లపు శ్రీను, పల్లపు నాగో రావు పాల్గొన్నారు.