- డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్కార్ట్ గన్ మన్ ఫజల్ సూసైడ్ పైన విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి లను డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ప్రకటన విడుదల చేసారు.
రాష్ట్ర మంత్రికి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న అధికారే ఆత్మ హత్య చేసుకున్నారంటే… రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆరోపించారు. పూర్తి స్థాయి విచారణ చేయకుండా.. ఆర్ధిక ఇబ్బందులు కారణం అని నిర్ధారణకు రాకూడదని పోలీస్ శాఖ కు సూచించారు. ఈ ఘటన మీద ఐపీఎస్ రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారి చేత విచారణ జరిపించాలని ప్రభుత్వంను డిమాండ్ చేసారు. నిజంగా బ్యాంకు అధికారుల వేధింపుల వల్ల సుసైడ్ చేసికుంటే… బాద్యులైన బ్యాంకు అధికారులను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేసారు. ఫజిల్ కుటుంబం సభ్యులకు పది కోట్ల రూ.. ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, ఫజల్ పెద్ద కూతురు ఫాతిమాకు గజిటెడ్ స్థాయి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వంను కోరారు. ఈ సుసైడ్ ఘటనతో ప్రజల మనస్సు కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. కెసిఆర్ పాలనలో మంత్రి ఎస్కార్ట్ అధికారే..సుసైడ్ చేసికున్నాడంటే
రాష్ట్రOలో పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో తెలుస్తుందన్నారు. ఈ ఘటన మీద తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ స్పందించాలన్నారు. ఫజిల్ ఆత్మ హత్యకు పాల్పడటమా.. మంత్రి ఉన్నత పోలీస్ అధికారుల వేధింపులా.. ఆర్ధిక. బ్యాంకు అధికారులు వేధింపులా.. అనేది రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి ప్రజలకూ చెప్పాలన్నారు. ఫజిల్ మృతి పట్ల తీవ్రంగా విచారo వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.