- పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు
- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్న జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో బిఆర్ఎస్ ఉద్యమకారులు బసంత్ రాజ్ ముదిరాజ్, నవీన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.
హైదరనగర్ డివిజన్ తులసి నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరగా.. వారికి జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఏకాంత్ గౌడ్, శ్రీకాంత్, మరేళ్ల శ్రీనివాస్, రమణ రెడ్డి, గోపాల్, లింగం, శివ, రెహమాన్,విజయ్ సేవ ధల్, రుబెన్, రాజు, అరుణ పాల్గొన్నారు.
- సిద్దిక్ నగర్ నుంచి…
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ ముఖ్య నాయకులతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో సిద్దిక్ నగర్ బిఆర్ఎస్ నాయకులు నందు, గోపాల్ గౌడ్, జమాల్,రవి యాదవ్,అలీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిపల్ యాదవ్. ఈ కార్యక్రమంలో విక్రమ్, రామ, అమ్రాన్, గణేష్, రాజు, రవి, శ్రీను, ఫారూఖ్, ఇమ్రాన్, అబ్దుల్, జమాల్, ఇస్సాతియక్, రవీందర్, ఇజ్రాయిల్,లక్ష్మీ పాల్గొన్నారు.