నమస్తే శేరిలింగంపల్లి: మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజి కాలనీలో రూ.55 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
అంతేకాక MIG కాలనీ లో సుమారుగా 2 కోట్ల 25 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న థీమ్ పార్క్ సుందరికరణ, అభివృద్ధి పనులను పనులను పరిశీలించమని తెలిపారు. పనులలో జాప్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐ క్యాస్ట్రో రెడ్డి, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ఆదర్శ్ రెడ్డి, జిహెచ్ ఎంసీ అధికారులు ఈ ఈ శ్రీనివాస్, డిఈ రమేష్, ఏ ఈ రమేష్ జలమండలి జీఎం రాజశేఖర్, డిజిఎం నాగప్రియ, మేనేజర్ సుబ్రమణ్యం, ఏఎంఓహెచ్ నాగేష్ నాయక్, ఎస్ ఆర్ పి భరత్ , డివిజన్ అధ్యక్షుడు బూన్, మహిళ అధ్యకురాలు జ్యోతి, ఎం. ఐ.జి కాలనీ అధ్యక్షుడు భాస్కర్ ముదిరాజ్, సెక్రెటరీ కుమార్, వార్డ్ మెంబర్ తిలావత్, సీనియర్ నాయకులు సంపత్ గౌడ్, చిన్న, రాకేష్, వెంకట్ రెడ్డి, సురేందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.