- కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ , నడిగడ్డ తండా కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రచారం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
ఇందులోభాగంగా పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ విప్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు , అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.