నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. చందానగర్ డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ, అర్జున్ రెడ్డి కాలనీ, సుభోదయ కాలనీలలో బిఆర్ఏస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బిఆర్ఏస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుభంద సంఘాలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజలు, కాలనీ వాసులు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాలనీలలో బిఆర్ఏస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని ప్రజలు కాలని వాసులు బిఆర్ఏస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారిని గేలుపించుకోవడానికి స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని అన్నారు.
గాంధీ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయన్నారు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా మళ్లీ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు విఠల్, బలరాం సింగ్, విష్ణు, సాయి ప్రసాద్, బాబు రావు, బిగ్గన్న, శ్రీకాంత్ రెడ్డి, పారనంది శ్రీకాంత్, భవాని చౌదరి పాల్గొన్నారు.