నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతోపాటు కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి రోడ్డు పనులలో నాణ్యతాప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ శ్రీకల, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్ లింగాయత్, గోపి నగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సీనియర్ నాయకులు బసవయ్య, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, యోగేశ్వర్ రావు, హరిబాబు, వెంకటేశ్వరరావు, యోగి, మహేష్ రాపన్, అలీ భాయ్, సుధాకర్, మల్లేష్, సత్తార్ భాయ్, మహిళా నాయకురాలు భాగ్యలక్ష్మి, ఝాన్సీ, సౌజన్య, కుమారి, శశికళ, స్వరూప, శిరీష, సుజాత, సత్యవతి, సుధారాణి, జయ, లక్ష్మి, రోజా, కాలనీ వాసులు పాల్గొన్నారు.
