నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జీహెచ్ఎంసీ ఫ్రూట్ స్టాల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులకు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా అతను అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. అతని వయస్సు సుమారు 35-40 సంవత్సరాలు ఉంటుందని, తెల్లటి దుస్తులు ధరించినట్లు చెప్పాడు. అతడు 10 రోజుల నుండి ఆ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నాడని, ఆహారం లేక అనారోగ్యంతో మరణించి ఉండవచ్చునని పోలీులకు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు.