నమస్తే శేరిలింగంపల్లి : ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ లో యావత్ కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఏ.ఐ.సీ.టి.యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి కర్ర దానయ్య కరపత్రాలను ఆవిష్కరించి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచి దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు ధారాధత్వం చేస్తూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ సంఘటిత, అసంఘటిత కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నదన్నారు.
స్వాతంత్ర్య పోరాట కాలంలోనే కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు బిజెపి ప్రభుత్వం పాతరేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని, ఈ లేబర్ కోడ్ల ద్వారా పనిగంటలు పెంచడం, సమ్మె చేసే హక్కు తొలగించడం, ఒకరోజు సమ్మె చేస్తే ఎనిమిది రోజుల వేతనం కట్ చేయడం, ఇష్టారాజ్యాంగా కార్మికులను తొలగించడం వంటి నిర్ణయాలను లేబర్ కోడ్ ద్వార మోడీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెడుతున్నారని, ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదని, కనీస వేతనాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు.
ఈఎస్ఐపిఎఫ్ తదితర చట్టాలు అమలు కావడం లేదని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఫిబ్రవరి 16న దేశ వ్యాప్త సమ్మెను, గ్రామీణ బందును దేశాన్ని రక్షించుకుందాం మోడీని గద్ద దింపుదామంటూ ప్రతిన బూనాలని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ, రైతాంగ సంఘాలు పిలుపు జయప్రదం చేయాలని కోరారు. ఫిబ్రవరి 16వ తేదీన హైదరాబాదులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద, గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో కార్మికులు, ప్రజలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. రమేష్ యార్లగడ్డ రాంబాబు, తుకారాం నాయక్, బూసాని రవి, జి.శివాని, నర్సింలు, లాలయ్య పాల్గొన్నారు.