- హయత్ నగర్ యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయ నిర్మాణ పనులను సందర్శించిన బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : హయత్ నగర్ యాదవ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం పనులను తెలంగాణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్, గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గోకుల్ శ్రీధర్ యాదవ్ సందర్శించారు. శ్రీకృష్ణ ఆలయం నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు సంఘం సభ్యులను ప్రశంసించారు. ఆలయ నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని, తమకు తోచిన విధంగా విరాళాలు అందజేయాలని తెలిపారు.
ఈ మహా నిర్మాణంలో ఆ శ్రీకృష్ణుని కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని అందరూ భాగస్వాములు కావాలని, దాతల సహాయ సహకారాలు ఉండాలని కోరారు. ప్రపంచానికి భగవద్గీతను అందించిన శ్రీకృష్ణ భగవానునికి ఆలయం నిర్మించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. శ్రీ కృష్ణ దేవాలయం హయత్‌నగర్ పునర్నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, విరాళాలు ఇచ్చేవారు 98488 12032 [Gpay, Ppay ]సంప్రదించండి. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్, నక్క ఉమేష్ యాదవ్, గడ్డం బాలకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, బాబురావు యాదవ్, కృష్ణ యాదవ్ దానయ్య యాదవ్ అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.