నమస్తే శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాద ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (35) మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద ఈనెల 26న రాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. రాయదుర్గం పోలీసులు ఆ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. మూతిడి పేరు వినోద్ అని మాత్రమే తెలిసింది అని మిగతా వివరాలు తెలియదని మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే రాయదుర్గం పోలీసులను సంప్రదించాలని తెలిపారు.