- రాగం నాగేందర్ యాదవ్ ఆదేశాల మేరకు కాలనిలో పర్యటించిన ఈ ఈ శ్రీనివాస్, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి గ్రామం బృందావనం కాలనీలో గ్రామ అధ్యక్షులు రవియాదవ్, ఏఈ సునిల్, స్థానిక కాలనీవాసులతో ఈఈ శ్రీనివాస్ పర్యటించారు. కొన్ని రోజులుగా రోడ్లపై పొంగిపొర్లుతున్న యూజీడి సమస్యని పరిష్కరించేందుకు రాగం నాగేందర్ యాదవ్ ఆదేశాల మేరకు వారు ఆ కాలనీలో పర్యటించి సమస్య ఉధృతిని తెలుసుకున్నారు. నూతనంగా చేపడుతున్న యూజీడీ పనులలో నాణ్యతాప్రమాణాలను పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. కార్యక్రమంలో తెరాసా పార్టీ అధ్యక్షులు రవి యాదవ్, తెరాసా సీనియర్ నాయకులు శ్రీనివాస రాజ ముదిరాజ్, ఏ ఇ సునిల్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, తెరాసా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అజీమ్, సుభాష్ రాథోడ్, బృందావనం కాలని వైస్ ప్రెసిడెంట్ క్ -రవి, బీమని మురళి, శ్యామ్ రాథోడ్, సురేశ్, పాశం రఘు, క్రాంతి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

