నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ రూ. 26 లక్షల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నారాయణ, మేనేజర్ యాదగిరి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ గౌస్, అశోక్, మహేష్,అంకా రావు, లోకేష్, నయీమ్, రాజు, దుర్గయ్య, చోటేమియా, దుర్గేష్, హమీద్ మరియు నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.