డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నాల పూడికతీత, నూతనంగా నిర్మిస్తున్న (యూజీడీ ) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను జిహెచ్ ఎం సి , వాటర్ వర్క్స్ అధికారులతో కలసి పరిశిలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీ కాంత్ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అక్కడ డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కాలనీలో , యూజీడీ, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సాయి చరిత , వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ , రఘు , నవీన్ , స్థానికులు విజయ్ , రమేష్ , పాల్గొన్నారు.

సమస్యను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here