అల్లా దయ అందరి పై ఉండాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ప్రతి హజ్ యాత్రికుడు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా, లాటరీలో ఎన్నుకోబడిన, రంగారెడ్డి జిల్లా పరిసర హజ్ యాత్ర భక్తులకు, కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ నందు, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్, సయ్యద్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్, హజ్ కమిటీ మెంబర్ సయ్యద్ నిజముద్దీన్, DMHO డా. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఏం అండ్ హెచ్వో డా. సృజన, డీఐఓ డా. స్వర్ణతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల కోసం ఎంత కృషి చేస్తున్నారని, హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

హజ్ యాత్ర భక్తులకు కోసం ఈ వైద్య శిబిరం కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ వద్ద మూడు రోజుల పాటు కొనసాగుతుందని , ఈ సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోవలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ డా. మూర్తి, కొండాపూర్ డివిజన్ బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, బీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, రజనీకాంత్, మంగళరాపు తిరుపతి పటేల్ , గణపతి, కచ్చావా దీపక్, హనుమంతు రెడ్డి, ఇసుక రమేష్, డా. మల్లేష్, అవదీష్ నారాయణ, రాజు, షేక్ రఫీ, నరసింహ రెడ్డి, ఈరన్న, నాగరాజు, మహమ్మద్ మరియు హజ్ యాత్రికులు పాల్గొన్నారు.

వైద్య పరీక్షలను పరిశీలిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here