అభివృద్దే ప్రధాన ఎజెండా: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.రంజిత్ రెడ్డి కి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు గాంధీ కి ప్రజల తరపున హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ/మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్ అధికారులు డి.జి.ఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరితో కలిసి నూతనంగా మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పైప్ లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, బస్తి కమిటీ సభ్యులు, ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here