నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధి రాజారాం కాలనీ, మాతృ శ్రీ నగర్, గోకుల్ ప్లాట్స్ కాలనీలలో రూ.87 లక్షల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ మేర భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరయ్యాయని, దానిలో భాగంగా శంకుస్థాపన చేపట్టినట్లు పేర్కొన్నారు. నిత్యం పొంగుతున్న ప్రాంతాలలోప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డిజిఎం నాగప్రియ, మేనేజర్లు పూర్ణేశ్వరి, సుబ్రమణ్యం , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.