రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘ‌ట‌న మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి అధికారి సురేష్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొతిలి అక్ష‌య్ కుమార్ (28) అనే వ్య‌క్తి ఖాజాగూడ‌లోని ఎల్ఎల్‌పీ కంపెనీలో ఉద్యోగిగా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తుండ‌గా, అత‌ని స్నేహితురాలు సుష్మా చౌద‌రి (28) స్థానికంగా ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా ప‌నిచేస్తూ కొండాపూర్‌లోని ఓ పీజీ హాస్ట‌ల్‌లో నివాసం ఉంటోంది. వీరు న‌వంబ‌ర్ 24న అర్థ‌రాత్రి స‌మ‌యంలో త‌మ స్నేహితుడు ఉల్లూరి సందీప్ నివాసానికి భోజ‌నానికి వెళ్లి అనంతరం తిరిగి వ‌స్తుండ‌గా, మార్గ‌మ‌ధ్య‌లో మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని హైటెక్‌సిటీ చిన్న పెద్ద‌మ్మ టెంపుల్ స‌మీపంలోని సీఐఐ జంక్ష‌న్ వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. అక్ష‌య్ కుమార్ త‌న మోటార్ సైకిల్ (ఏపీ31డీజ‌డ్6751)పై సుష్మా చౌద‌రిని వెనుక కూర్చోబెట్టుకుని వ‌స్తుండ‌గా రాత్రి 1 గంట‌కు సీఐఐ జంక్ష‌న్ స‌మీపంలో అక్ష‌య్ త‌న బైక్‌ను వేగంగా, నిర్ల‌క్ష్యంగా న‌డిపించాడు. దీంతో వాహ‌నం అదుపు త‌ప్పి డివైడ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో సుష్మా చౌద‌రి బైక్ వెనుక నుంచి ఒక్క‌సారిగా కింద‌ప‌డ‌డంతో ఆమె త‌ల‌, ముఖానికి తీవ్ర గాయాల‌య్య‌యి. ఆమెను చికిత్స నిమిత్తం మాదాపూర్‌లోని మెడిక‌వ‌ర్ హస్పిట‌ల్‌కు త‌రలించ‌గా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here