కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్రమ అరెస్ట్ సిగ్గుచేటు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

  • రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం చేతకాదు, హామీలు నెరవేర్చడం చేత కాదు…ఇలాంటి చేతగాని ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచిన బి.ఆర్.ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపవాస దీక్ష చేస్తుండగా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. దీనికి నిరసనగా మసీద్ బండ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి అనంతరం మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉన్నదని, ఎంతమందికి ఉపాధి కల్పించారని ప్రశ్నించారు. రాష్ట్రం లో 2018 గణాంకాల ప్రకారం ఉండాల్సిన ఉద్యోగులు 4,40,000 ఉన్న ఉద్యోగులు 3,25,000, ప్రతి సంవత్సరం 3 నుండి 4 శాతం పదవి విరమణ పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల పి.ఆర్ సి లెక్కల ప్రకారం 1,91,000 ఖాళీలు ఉన్నాయని, వీటిలో ఇప్పటివరకు 35 వేల నుండి 40 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. 2022లో నిరుద్యోగుల శాతం 7.7 ఉంటే ,ఇప్పుడు 9.9 శాతం అంటే ఒక్క సంవత్సరంలో 2 శాతం పెరుగుదల , ఆర్బీఐ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 34 శాతం ,పట్టణాల్లో 65 శాతం నిరుద్యోగులు ఉన్నారు ,వారిని ఓట్ల కోసం , మీ జెండా లు మోయటం కోసం తప్ప ఎరోజైన పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

2014 హామీ ఇచ్చిన ఇంటికో ఉద్యోగం లేదు ,2018 లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి లేదు, నోటిఫికేషన్లు ఇస్తే లీకేజీలు ,లేదా కేసులు పెట్టించి ఆపేయడం పట్ల ప్రభుత్వానికి సిగ్గుండాలని, తక్షణమే ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, లేని పక్షంలో యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ , ఆంజనేయులు, చంద్రశేకర్ యాదవ్, రమేష్ పద్మ , రమణి , భరత్, శ్రీశైలం యాదవ్, వినయ్, రాజేష్, మన్యం, రవి కాంత్, ముకేష్, సురేష్ , నామ్ దేవ్ , మరియా , సహదేవ్ , మహేష్, వివిధ మోర్చల నాయకులు, మహిళ మోర్చ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here