నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధి గోకుల్ ప్లాట్స్ లో రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (యూజీడీ) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, అత్యవసరం ఉన్నచోట , నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు డీజీఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, రంగారావు, గోపాల్, నారాయణ, సుబ్రమణ్యం, దేవరాజ్, రాజేంద్ర రెడ్డి, శేఖర్ బాబు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా, కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.