నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలిగా మద్దూరి నాగలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మద్దూరి నాగలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకంతో హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కి, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి కి, తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి నేమూరి శంకర్ గౌడ్ కి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగంకి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ మాధవ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు.