- బీసీ నాయకులతో ఆత్మీయ కలయికలో బీసీ ఐక్యవేదిక చైర్మన్
భేరీ రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యేవరకు పోరాడుదామని బీసీ ఐక్యవేదిక చైర్మన్ భేరీ రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న పిలుపునిచ్చారు. గాంధీనగర్ గుల్ మొహర్ పార్క్ బీసీ నాయకులను కలిసి నేటి రాజకీయాల గురించి చర్చించారు. బీసీలకు రాజకీయ అధికారం వచ్చేవరకు శేరిలింగంపల్లి నుండి యావత్ తెలంగాణ రాష్ట్రం బీసీ ఐక్యవేదిక ద్వారా ఉద్యమం చేస్తూ పోరాడుదామన్నారు.
ముందుగా హైదరాబాద్ లోని అన్ని బస్తీల ద్వారా ఏకముదామని, 33 జిల్లాలు గ్రామం నుండి మండలం , జిల్లా బీసీలను ఏకం చేసి ఐకమత్యంతో ముందుకు వేళ్దామని చెప్పారు. సిపిఎం ముఖ్య నాయకులు మాణిక్యం ముదిరాజ్, శేరిలింగంపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్, బెస్త సంఘం అధ్యక్షులు యాదగిరి, రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.