నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ బస్తీలో జలమండలి నిధులతో రూ. 30 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మార్చి, పెరుగుతున్న జనసాంద్రతను, భవనాలను దృష్టిలో పెట్టుకొని నూతన డ్రైనేజీ లైన్ల పరిధిని పెంచి నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు వేయిస్తున్నట్లు తెలిపారు. కొండాపూర్ డివిజన్ లోని ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, ఫాజిల్, సాగర్, గణపతి, నందు, విజయ్, వెంకటేష్, ఆనంద్, అరవింద్ ఉన్నారు.