కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాం

  • రూ. 12 కోట్ల 15 లక్షల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు
  • కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రూ. 12 కోట్ల 15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటగా టిఎన్జీవోస్ కాలనీ ఫేజ్1 & 3, సెక్రటేరియట్ కాలనీ, రంగారెడ్డి కాలనీలో రూ. 8 కోట్లు 75 లక్షలతో అంచనా వ్యయంలో చేబట్టబోయే భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు, జర్నలిస్ట్ కాలనీలో రూ. 3 కోట్లు 40 నలభై లక్షల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి శంకుస్థాప చేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన గచ్చిబౌలి డివిజన్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ బస్తీ, కాలనీల్లో కోట్ల నిధులు వెచ్చించి మంచినీరు, రోడ్లు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్, డిజిఎం నారాయణ,మేనేజర్ నరేందర్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు, మహిళ నాయకులు , మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులు, అభిమానులు, టిఎన్జీవోస్ కాలనీఫేజ్1 & 3, సెక్రటేరియట్ కాలనీ, రంగారెడ్డి కాలనీ, జర్నలిస్ట్ కాలనీ వాసులు, స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here