దోమల నివారణకు పిచికారీ చేయించండి : ఏఐఎఫ్ డివై

నమస్తే శేరిలింగంపల్లి: దోమల బెడద నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (ఏఐఎఫ్ డివై) గ్రేటర్ హైదరాబాద్ కన్వినింగ్ కమిటీ తరపున చందానగర్ సర్కిల్-21 అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏ ఐ ఎఫ్ డి వై నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, దాసరి కీర్తి, ఎండి సుల్తానా బేగం మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మురికి వాడలు, కాలనీలలో దోమల బెడద వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. ప్రస్తుత ఎండాకాలంలో ఉక్కపోతకు తోడు దోమల విజృంభనతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పారు. నాలా, యూజిడి ప్రాంతాలలో టిఎన్ నగర్, ఎఫ్ సి ఐ కాలనీ, న్యూ కాలనీ, ఓంకార్ నగర్, స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్, నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, డైనమిక్ కాలనీలలో ఈ సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు. దోమల నివారణకు పిచికారీ చేయించాలని విజ్ఞప్తి చేశారు.

చందానగర్ సర్కిల్-21 అసిస్టెంట్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఏవైఎఫ్ డివై నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here