- ఘనంగా సత్కరించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన 83 కేజీల పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో లింగంపల్లి గ్రామం కు చెందిన ఉదయ్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఉదయ్ ని మసీదు బండలోని కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వివిధ క్రీడలలో ఎంతో మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సాహం ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలోనూ రాణించి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. క్రీడారంగంలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని, రాబోయే కాలంలో కూడా క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తామని తెలిపారు.