ఆలయాల అభివృద్ధికి కృషి

  • గచ్చిబౌలి విలేజ్ మైసమ్మ పోచమ్మ గుడి నిర్మాణానికి రూ. లక్ష విరాళం అందించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని గచ్చిబౌలి విలేజ్ శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ పోచమ్మ గుడి నిర్మాణానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన వంతు సహకారంగా రూ. లక్ష విరాళాన్ని గుడి అధ్యక్షులు వేమానంద రావుకి అందజేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దేవస్థానం ఏర్పాటుకు ఆర్థికంగా సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు . గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతుగా ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వేమానంద రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ గారు, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, మైసమ్మ పోచమ్మ గుడి అధ్యక్షులు వేమానంద రావు,ప్రధాన కార్యదర్శి తోట్ల జైహింద్, వైస్ ప్రెసిడెంట్ గడ్డ బాలరాజ్, మణికొండ యాదయ్య, కోశాధికారి గడ్డ అర్జున్, రాఘవ చారి పాల్గొన్నారు.

మైసమ్మ పోచమ్మ గుడి అధ్యక్షుడు వేమానంద రావుకి లక్ష రూపాయలు చెక్కు రూపేణా అందజేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here