- బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ప్రత్యేక పూజలు
నమస్తే శేరిలింగంపల్లి : తారా నగర్ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, జెబిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ పాల్గొని అమ్మవారిని వేడుకున్నారు.
పాడిపంటలు బాగుండాలని, ఐక్యమత్యంతో ఆనందంగా జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చెరుకు గోదాం తెలుగు సుభాష్ ముదిరాజ్, బీసీ నాయకులు కటికే రామచందర్, కే నరసింహ యాదవ్, కే చంద్రశేఖర్ యాదవ్, ప్రజా ప్రతినిధులు ధారానగర్ పెద్దలు యువజన నాయకులు మహిళా సోదరులు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.