- శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారనగర్ లో రూ. 10 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో నూతనంగా నిర్మించబోయే మహిళ భవనం నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ సమగ్ర , సంతులిత అభివృద్ధిలో భాగంగా తార నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మహిళ భవనం నిర్మాణం కోసం ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ మొత్తం రూ. 10 లక్షలను ఎమ్మెల్యే (CDP FUNDS ) నుండి మంజూరు చేయించామని తెలిపారు. మహిళ భవనం నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పేద , మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మహిళ భవనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయ మన్నారు. ఇక్కడి ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ఈ మహిళ భవనంలో సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్లు, జన్మదిన వేడుకలు , వివాహాలు, షష్టిపూర్తి వేడుకలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ భవనాన్ని అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో నిర్మించనున్నట్లు చెప్పారు. తాము అడిగిన వెంటనే మహిళ భవనం నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వ విప్ గాంధీ కి కాలనీ వాసుల తరపున తార నగర్ కాలనీ వాసులు, మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు మల్లికార్జున శర్మ, అబీబ్, పద్మారావు, కృష్ణ యాదవ్, పొడుగు రాం బాబు, నటరాజు,, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణ, గోపి, గోపాల్ యాదవ్, రవి యాదవ్, నరసింహ రెడ్డి, కవిత , కర్ణాకర్ గౌడ్,నాగరాజు,అక్బర్ ఖాన్ సలీం, నరేందర్ బల్లా , కవిత, రజిత,జ్యోతి, సునీత,విజయలక్ష్మి,లలిత, సంగీత, నీరజ మరియు నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.