నమస్తే శేరిలింగంపల్లి : సామాజిక న్యాయ వారోత్సవ సందర్భంగా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు మహేష్ యాదవ్ రైతులకు అవగాహనా కల్పించారు. గచ్చిబౌలి శేరిలింగంపల్లిలో నిర్వహింకార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఇంఛార్జి భవనం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొగ్గుల మాధవరెడ్డి , బీజేపీ జిల్లా కార్యదర్శి మూల అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు చిరుధాన్యాలు పండించాలి, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాల ని, ప్రజలందరూ తృణధాన్యాలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి నరసింహ రావు గారు నాయకులు లక్ష్మణ్ గౌడ్, ప్రపుల్లకుమార్, బిశ్వాస్ , శత్రుఘన్, నాంపల్లి రవి , విద్యాసాగర్ రైతులు ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.