జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గా బోనకుర్తి సురేష్ నియామకం

  • అభినందనలు తెలిపిన బిఎల్ఎఫ్

నమస్తే శేరిలింగంపల్లి : మహాత్మ బాపూజీ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గా మియాపూర్ ప్రాంత స్టాలిన్ నగర్ నివాసి బోనకుర్తి సురేష్ ను ప్రభుత్వం నియమించింది. బోనకుర్తి సురేష్ ఎంబిసి సంచారజాతుల కులమైన బుడబుక్కల కులం రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సంచార జాతులను ఏకం చేసి తమ హక్కుల కోసం పోరాడుతూ అనేకమార్లు ప్రభుత్వాలను అర్జిస్తూ వస్తున్నారు. ఎంబీసీ సంచార జాతలోని బుడబుక్కల కులం సంబంధించిన సురేష్ ను రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గా నియమించింది.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గా నియామక పత్రం అందుకుంటున్న బోనకుర్తి సురేష్

ఈ సందర్భంగా బోనకుర్తి సురేష్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఉత్సవం కమిటీ కి ఎంబీసీ సంచార జాతుల కులాల నుంచి మమ్మల్ని గుర్తించి బుడబుక్కల కులం నుంచి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలకు తనను నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ , బీసీ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర్ల కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

బి యల్ యఫ్ అభినందనలు

మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ గా బోనకుర్తి సురేష్ గారిని నియమించడానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ అభినందనలు తెలియచేసింది. ఈ సందర్భంగా స్టాలిన్ నగర్ లో బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల, ఎంబీసీ సంచారజాతులను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నుంచైనా ప్రత్యేక కార్యచరణ రూపొందించి పాటుపడాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ (BLF)శేరి లింగంపల్లి నియోజకవర్గ నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఏఐఎఫ్ డివై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు కె శరీష్, టి నర్సింగ్, హనుమంతు, ముకుంద, బాలకృష్ణ, సున్నపు నర్సింలు, మధుసూదన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here