నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ తాండ్ర రామచంద్రయ్య భవన్ ఎదుట MCPIU పార్టీ అఖిలభారత మహాసభల లోగో ఆవిష్కరణ సందర్భంగా నవంబర్ 12 ,13, 14 తేదీలలో ఎంసిపిఐ (యూ) అఖిలభారత మహాసభలు నిర్వహించనున్నట్లు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ తెలిపారు. ఈ మహాసభలకు 14 రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అలాగే దేశంలో నెలకొన్న సమస్యలపై వివిధ వామపక్ష ప్రజాసంఘాల పార్టీల జాతియ నాయకులు సహర్ద సందేశం ఇవ్వడానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మదన్ శెట్టి రమేష్, గ్రేటర్ కమిటీ సభ్యులు రాంబాబు, కర్ర దానయ్య, పల్లె మురళి, అంగడి పుష్ప, విమల, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు సుల్తానా, శ్రీలత, లావణ్య, రాములు పాల్గొన్నారు.
