నమస్తే శేరిలింగంపల్లి : బూత్ ఇంచార్జీ లు, నూతనంగా 5 జిల్లాల నుండి విచ్చేసిన కోఆర్డినేటర్స్ తో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, మాజీ పార్లమెంటు సభ్యులు చాడా సురేష్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు బొడిగే శోభా, నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాలు శ్రీధర్ రెడ్డి , పలు జిల్లాల నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. బూత్ ఇంచార్జులకు , బూత్ కమిటీ సభ్యులకు చేయవలసిన కార్యక్రమాలు, ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేసి, పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు బిజెపియే ప్రత్యామ్నాయ శక్తి అని అన్నారు.