మునుగోడు నియోజకవర్గం దశ, దిశ మార్చే శక్తి తెరాసకే ఉంది : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం దశ, దిశ మార్చే ఏకైక శక్తి తెరాస పార్టీకే ఉందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదేశాల మేరకు , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జోగిగూడెం గ్రామంలోని ప్రజల వద్దకు వెళ్లి తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తమ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, తెలంగాణ యాసకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చి పెట్టి, తెలంగాణ బిడ్డల బలిదానాలకు, త్యాగాలకు ఒక అర్ధాన్ని తెచ్చిన ఒక గొప్ప మహా నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ప్రాణాలకు సైతం తెగించి, కష్టపడి, కోట్లాడి తెచ్చిన స్వరాష్ట్రాన్ని రాబందుల పాలు కాకుండా ఉండాలంటే మునుగోడు ప్రజలలో చైతన్యం వచ్చి, బీజేపీ పార్టీ చేస్తున్న అరాచక రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే, బానిస సంకెళ్లు మనకు మనమే వేసుకున్నట్లు అవుతుందని అన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో తెరాస సీనియర్ నాయకులు రక్తపు జంగంగౌడ్, రవి శంకర్ నాయక్, సాయి బాబు సాగర్, శంకర్ నాయక్, బేర చంద్రశేఖర్, సిలివేరు వెంకటేష్, చక్రి, నరసింహ, బేర రాములు పాల్గొన్నారు.

జోగిగూడెం గ్రామంలో ప్రభాకర్ రెడ్డికి తమ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here