అమరుల త్యాగాలు మరువలేనివి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,

  • పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్
  • “రక్తదానం ప్రాణదానం”, రక్తదానంపై అపోహలు వద్దు: సైబరాబాద్ సీపీ

నమస్తే శేరిలింగంపల్లి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ‘’మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్’’, “ ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్” ను నిర్వహించారు. ఈ క్యాంప్ ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ.. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరుపున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. తలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని సీపీ అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు. సైబరాబాద్ పోలీసులు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్, నీలోఫర్ చిల్డ్రన్ ఆసుపత్రి , M&J కాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ జరుగుతుందన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది కోసం పాణినీయ డెంటల్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్ ఉల్ హక్, ఆర్‌ఐ లు తదితర పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సీపీ, జాయింట్ సీపీ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్ ఉల్ హక్, సి‌ఎస్‌డబ్ల్యీ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీలు, సి‌టి‌సి డాక్టర్ సుకుమార్, డాక్టర్ సరిత, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి డాక్టర్లు జాన్, డాక్టర్ సరిత, సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ శ్రవణ్, నీలోఫర్ చిల్డ్రన్ ఆసుపత్రి డాక్టర్ కిరణ్మయి, M&J కాన్సర్ ఆసుపత్రి సుహాసిని, పాణినీయ డెంటల్ ఆసుపత్రి డాక్టర్ ముసాదక్, డాక్టర్ జోసెఫ్, ఆర్ఐలు తదితరులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


సైబరాబాద్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో వైద్యులతో మాట్లాడుతున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here