ఎస్ ఎస్ సి ఫలితాలలో ‘త్రివేణి’ టాప్ గ్రేడ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎస్ ఎస్ సి ఫలితాలలో మియాపూర్ బ్రాంచ్ త్రివేణి విద్యార్థులు సత్తా చూపారు. టాప్ గ్రేడులను సాధించి ప్రతిభ చాటారు. గతంలో సాధించిన విజయాలకంటే ఘనంగా మరిన్ని విజయాలను సాధించారు. అత్యధిక పాస్ పర్సంటేజీ కూడా సొంతం చేసుకున్నారు. ఈ సందర్బంగా త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డా. గొల్లపూడి వీరేంద్ర చౌదరి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో తమ విద్యార్థులు ఎస్.ఎస్.సి గ్రేడుల్లో జి పి ఎ ప్రకారం 10/10 పాయింట్లు 10 మంది సాధించారని తెలిపారు. అలాగే 9.8 పైగా పాయింట్లను 12 మంది విద్యార్థులు 9.7కి పైగా 16 మంది విద్యార్థులు 9.5 కి పైగా పాయింట్లను 24 మంది విద్యార్థులు 9.0కి పైగా పాయింట్లను 39 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. గణితంలో ఏ గ్రేడులను 27 మంది విద్యార్థులు సైన్స్ లో ఏ గ్రేడులను ను 18 మంది విద్యార్థులు సోషల్ లో ఏ గ్రేడులను 24 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు.

అభినందనలు తెలుపుతూ ..

ఇక మొత్తంగా ఏ గ్రేడులను 39 మంది విద్యార్థులు సాధించారని. ఇన్ని విజయాలకు కారణం మారే తరానికి, మారే విద్యావిధానాలకు అనుగుణంగానూ, నేటి పోటీ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళికలను రూపొందించి తదనుగుణంగా విద్యనందిస్తున్నామని తెలిపారు. తమ విద్యాసంస్థలో అనుభవం, అంకితభావం గల బోధన సిబ్బంది ఉండడం వలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి ఒలంపియాడ్స్ లో తమ విద్యార్థులు టాప్ వన్ నుండి టాప్ టెన్ లో పలు ర్యాంకులు సొంతం చేసుకున్నారని అన్నారు. రేపటి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించేలా పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుందని, వారి ఉజ్వలభవితకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిఎసి నటరాజ్, సీఆర్ ఓ సాయి నరసింహారావు, ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ రావు, ఉపాధ్యాయులు, ఇన్ చార్జ్, తల్లిదండ్రులు పాల్గొని శుభాభివందనాలు తెలిపారు.

విజయ సంకేతం చూపిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here