నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ లోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ పిక్స్ మోమోస్ ఫుడ్ స్టాల్ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ముఖ్యఅతిధిగా రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్ విచ్చేసి ఫుడ్ స్టాల్ ని ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చ కార్యదర్శి కుమార్ సాగర్, డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ నాయక్, విజయ్ చౌదరి అరుణ్ పటేల్ పాల్గొన్నారు.
