- మైమరపింప జేసిన సైన్స్ ఉత్సవ్
- ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్ల ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి త్రివేణి పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన కోలాహలంగా కనుల విందుగా సాగింది. పాఠశాలలోని పలు విభాగాలలో నిర్వహించిన ప్రదర్శనలు అలరించాయి. తెలుగు విభాగంలో ఏర్పాటు చేసిన అచ్చులతో రామాయణం, నమూనా కోర్టు మరెన్నో మైమరపింపజేశాయి. హిందీ విభాగంలో ఎర్రకోట ప్రదర్శన, ఇంగ్లీష్ విభాగంలో భాషా పర అంశాలతో పాటు ‘ మర్చంట్ ఆఫ్ వెనిస్ ‘ నాటకం ఆకట్టుకున్నది. గణిత విభాగం లోని ఎన్నో ప్రదర్శనలు తల్లిదండ్రులను మెప్పించాయి. విజ్ఞాన శాస్త్రంలోని పునరుద్ధరించే సహజ వనరుల గురించి చక్కగా ప్రదర్శించారు.

సాంఘిక శాస్త్రంలో కొన్ని ప్రదర్శనలు ఉత్తమంగా నిలిచాయి. ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయుడు శంకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఆర్ ఓ సాయి నర్సింహ రావు, ఇన్ ఛార్జ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాల్గొని వేడుకను దిగ్విజయం చేశారు.
