అత్యాధునిక హంగులతోనాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు

  • ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం
  • కేపీహెచ్ బి బస్టాప్ వద్ద ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ అదనపు డీజీపీ
  • హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో ప్రయాణం
  • స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 ఏర్పాటు
కేపీహెచ్ బి బస్టాప్ వద్ద నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ అదనపు డీజీపీ, ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ కేపీహెచ్ బి బస్టాప్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌ , ఐపీఎస్‌ అదనపు డీజీపీ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి నాన్‌ ఏసీ స్లీపర్‌ 10 బస్సులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకప్పుడు నష్టాలలో ఉన్న టీఎస్‌ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో లాభాల బాటలో ప్రయాణించే లా చర్యలు తీసుకున్నారని, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తుందని పేర్కొన్నారు.
మొదటగా 4 స్లీపర్‌, మరో 6 స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రైవేట్‌ బస్సులకు ధీటుగా అత్యాధునిక హంగులతో రూపొందించిన ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుందని స్పష్టం చేశారు.

నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ

బస్సు ప్రత్యేకతలు

  • స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 ఉన్నాయి. ప్రతి బెర్త్‌ వద్ద వాటర్‌ బాటిల్‌ , మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం కల్పించారు.
  • సీటర్‌ కమ్‌ స్లీపర్‌ బస్సుల్లో 15 అప్పర్‌ బెర్తులతో పాటు లోయర్‌ లెవల్‌లో 33 సీట్ల సామర్థ్యం ఉంది. ప్రతి బస్సుకు ఎయిర్‌ సస్పెన్షన్‌ సదుపాయం కలదు.
  • ప్రతి బస్సులో వైఫై సదుపాయం కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఒక వాటర్‌ బాటిల్‌తో పాటు ఫ్రెషనర్‌ను ఉచితంగా అందజేస్తారు. తమ లగేజీ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారు.
  • బస్సుకు ముందు, వెనక గమ్యస్థానాల వివరాలు తెలుగు, ఇంగ్లీషు భాషలో చెప్పే ఎల్‌ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు.
  • ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫ్రంట్‌ రోడ్‌ వ్యూ, ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం, బస్సు లోపలి ప్రాంతంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
  • అగ్నిమాపక పరికరాలు కూడా బస్సుల్లో ఉన్నాయి.

బస్సుల వేళలు

  • కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ నుంచి బయలుదేరుతాయి. ప్రతి రోజు రాత్రి 07.45, 8.30 గంటలకు నడుస్తాయి. కాకినాడ నుంచి తిరిగి రాత్రి 07.15, 07.45 గంటలకు హైదరాబాద్‌కు ప్రారంభమవుతాయి.
  • విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ప్రతి రోజు మియాపూర్‌ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45, రాత్రి 9.30 , 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు ఉదయం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్ ఐపీఎస్, పురుషోత్తం ఈడీ (హెచ్ జెడ్ ) వినోద్ కుమార్ ఈడీ (ఈ, ఫై & ఏ ఎం ), యాదగిరి ఈడీ (జిహెచ్ జెడ్ ), మునిషేకర్ ఈడీ (O & Secrey to crop), మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, పోతుల రాజేందర్, నక్క శ్రీనివాస్, రావూరి సైదేశ్వర్ రావు, గోపిచంద్, బాలు, హరిబాబు, మహాదేవ్, కుమార స్వామి, అష్రఫ్, సత్తార్, సదా బాలయ్య, కృష్ణ, కృష్ణ కుమారి, విమల, ప్రమీల, మాధవి, స్వప్న, రేణుక, చంద్రిక, సత్తుర్ శిరీష్, ఎలేంద్ర పాల్గొన్నారు.

నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న అధికారులు, ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here