బాలుర వసతిగృహంలో మొక్కలు నాటిన కలివేముల వీరేశం గౌడ్

బీసీ హాస్టల్ ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న వీరేశం గౌడ్ తదితరులు

శేరిలింగంపల్లి: (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ దివంగత ఇంచార్జ్, ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం గోపి నగర్ లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కలి వేముల వీరేశం గౌడ్ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేర్లింగంపల్లి లో టిఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కొండకల్ శంకర్ గౌడ్ చేసిన కృషి మర్చిపోలేనిది అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి,కోండకల్ శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, అశోక్, ప్రవీణ్ వినయ్, శ్రీకాంత్, బిక్షపతి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here