ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్

  • KPHB 7 ఫేజ్ వద్ద సిగ్నల్ ఏర్పాటు
  • ప్రారంభించిన ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాసరావు IPS,

నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పెట్ నుంచి ఖైత్లాపూర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి… సాఫీ ప్రయాణానికి దారులు పడ్డాయి. ఒకప్పుడు ఇష్టారీతిన వెళ్లినవారు ప్రస్తుతం క్రమ పద్దతిలో నడుచుకోనున్నారు. కేపీహెచ్ బి ఫేజ్ -7 వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటే ఇందుకు కారణం. ఈ ట్రాఫిక్ సిగ్నల్ ను ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాసరావు IPS, ప్రారంభించారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు వాళ్ళ ఖైత్లాపూర్ నుంచి హాఫిజ్ పెట్ , హాఫిజ్ పెట్ నుంచి ఖైత్లాపూర్ వెళ్లే వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు వీలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ ACP హనుమంత రావు, కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్లు నర్సింహా రావు, క్రాంతి, మాదాపూర్ ఇన్ స్పెక్టర్ నర్సయ్య పాల్గొన్నారు.

KPHB 7 ఫేజ్ వద్ద సిగ్నల్ ను ప్రారంభిస్తున్న ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాసరావు IPS

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here