- భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పి. ఏ నగర్ నుంచి కృష్ణ, మహేష్, వెంకట్, నరసింహులు, శేఖర్, విజయ్, కరుణాకర్ రెడ్డి, చిత్తరంజన్, మల్లారెడ్డి , శివ బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బిజెపి చేపడుతున్న అభివృద్ధికి, రవికుమార్ యాదవ్ నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరామని వారు ఈ సందర్బంగా తెలిపారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే అందరం ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రజలందరికీ తెలపాలని, ఎన్నికలప్పుడు ఎవేవో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. తానెప్పుడూ ప్రజల బాగోగులగురించి, కార్యకర్తల గురించి తప్ప తన వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచన చేయలేదని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన , ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని, ఎలాంటి సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వినోద్ యాదవ్ , కుమార్, ఆంజనేయులు సాగర్, భరత్ , పద్మ, పార్వతి, నాగులు, మహేష్, ముకేష్ గౌడ్ పాల్గొన్నారు.