నమస్తే శేరిలింగంపల్లి: ఐఐటి వద్ద నెలకొన్న ట్రాఫిక్ సమస్య ను గచ్చిబౌలి ట్రాఫిక్ సి ఐ నవీన్ కుమార్ తో కలిసి క్రమబద్ధికరించారు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. గచ్చిబౌలి నుండి కొత్తగూడ వెళ్లే మార్గంలో నూతనంగా ప్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా తాత్కాలింకంగా రోజు ఇదే పరిస్థితి నెలకొంటుందని, ప్రజలు గమ్యాస్థలాలకు చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు.

గచ్చిబౌలి ట్రాఫిక్ సి ఐ నవీన్ కుమార్ తో కలిసి ట్రాఫిక్ ను క్రమబద్ధికరిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్