నమస్తే శేరిలింగంపల్లి: పొతుకూచి సోమసుందర సామజిక సేవా, దాతృత్వ సంస్ధ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష శిక్షణ పొందిన విద్యార్థులకు కావూరి అనిల్ కుమార్, మాతృశ్రీ నగర్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మాతృశ్రీ నగర్ ట్రస్ట్ లో హాల్ టికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ అందిస్తున్న సేవలు వినియోగించుకొని పైకి రావాలని వృద్యార్ధులకు సూచించారు. ట్రస్ట్ చైర్మన్ పొతుకూచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే 12 కేంద్రాలలో 700 మంది విద్యార్థులు సాయం పొందారని, ఈ సంవత్సరం 200 మంది పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ఈ విధంగా అనేక ప్రాంతంలో విద్యార్థులకు సేవ చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుల భేతాళం భారత్ ర్యాట్ సభ్యులు గన్ను స్వాతి, దాసరి హరిందర్, రవి కిరణ్, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొన్నారు.