నమస్తే శేరిలింగంపల్లి : :శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ జగదీష్ గౌడ్ జన్మదినం సందర్భంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేద బాలిక నిషితకు సైకిల్ ను బహుమతిగా ఇచ్చారు.
తన ఇంటి నుంచి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోడానికి ఇబ్బంది పడుతున్న నిషితకు ఈ విధంగా సహాయ పడడం సంతోషానిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ , యశ్వంత్ పాల్గొన్నారు.