
వరద ముంపు ప్రాంతాల్లో దుప్పట్ల పంపిణీ
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు వరద ప్రభావంతో నీట మునిగి అక్కడి ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగేందుకు మంచినీరు కూడా లభించక దయనీయ స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వంతు బాధ్యతగా వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు తిరంగా యూత్ కు చెందిన యువకులు. తిరంగా యూత్ ఆధ్వర్యంలో పాతబస్తీలోని వరద ముంపు ప్రాంతాలైన బాలాపూర్, బాబానగర్లలో దాతలు పృధ్వీరాజ్ రెడ్డి, హజర్ ల సహకారంతో దాదాపు 500 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరంగా యూత్ అధ్యక్షుడు రోషన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి చేయూతను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తమకు తోచినంత లో వరద బాధితులకు దుప్పట్లను పంపిణీ చేశామని తెలిపారు దాతలు ముందుకు వస్తే మరిన్ని ప్రాంతాల్లో తమ సేవా కార్యక్రమాలను అందిస్తామని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు పల్లె మురళి, సభ్యులు ఫరీష్, ఖాదర్, అక్రమ్, హాందన్ తదితరులు పాల్గొన్నారు.
