చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో పోచమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ అమ్మవారు గాయత్రి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
